సత్యసాయి: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 19న ప్రధాని మోదీ, 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టపర్తికి రానుండడంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని CM చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రముఖుల పర్యటన దృష్ట్యా భద్రత, పట్టణ సుందరీకరణపై దృష్టి సారించాలన్నారు.