WNP: పట్టణంలోని 33/11 కేవీ ఉపకేంద్రంలో అదనంగా 1X5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఉపకేంద్రం నుంచి విద్యుత్ సరఫరా అయ్యే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ ఏఈ సుధాకర్ తెలిపారు.