AP: సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. 50 MSME పార్కులను వర్చువల్గా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో రూ.810 కోట్ల పెట్టుబడులతో MSME పార్కులు నిర్మించనున్నారు. తద్వారా 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. పెదఈర్లపాడులో 20 ఎకరాల్లో రూ.7 కోట్ల వ్యయంతో MSME పార్కులను ప్రారంభించనున్నారు.