VZM: బొబ్బిలి రైల్వే స్టేషన్లో సోమవారం రాత్రి RPF పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఢిల్లీలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇన్స్పెక్టర్ ఆర్.సి పండా చెప్పారు. ప్లాట్ ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు బ్యాగులను తనిఖీ చేసి, రైల్వే వంతెన, రైల్వే పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సురక్షిత ప్రయాణం కోసం విస్తృత తనిఖీలు చేసినట్లు పండా పేర్కొన్నారు.