TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా శ్రీపతి బాబు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం TDP కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం శ్రీపతి బాబు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల TDP ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన సత్యవేడు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కూడా పనిచేశారు.