BPT: విద్యుత్ మరమ్మతుల నిమిత్తం మంగళవారం అద్దంకిలో పవర్ సరఫర నిలిచిపోతుందని ఈఈ మస్తాన్రావు తెలిపారు. రవి బార్ రెస్టారెంట్ నుంచి భవాని సెంటర్ వరకు ఉన్న ప్రాంతాలు, అలాగే భాగ్యనగర్ పరిసరాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఉండదని అధికారులు వెల్లడించారు. ఈ అంతరాయం దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.