MBNR: తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరిలోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, అందెశ్రీ కీలక పాత్ర పోషించారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అందెశ్రీ భౌతిక కాయానికి నిన్న ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన రచించిన పాటలు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లో నింపాయన్నారు. అందెశ్రీ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోతారని మంత్రి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.