KDP: ప్రొద్దుటూరులో సోమవారం రాత్రి వాహనాలు, లాడ్జిల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలు మేరకు తనిఖీలు చేపట్టినట్లు త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు, ఘటనలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జిల్లో బస చేసే వారు గుర్తింపు వివరాలు రికార్డుల్లో కచ్చితంగా నమోదు చేయాలని మేనేజర్లను ఆదేశించారు.