KNR: ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను బైండోవర్ చేసినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గొల్లపల్లికి చెందిన దర్శనాల మహేష్, కిసాన్ నగర్‌కు చెందిన పండుగ అనిల్, నీరుకుల్ల కుమార్ ఇటీవల ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. మరోసారి ఇసుక రవాణా చేయకుండా రూరల్ తహసీల్దార్ ముందు రూ. 3 లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేసినట్లు చెప్పారు.