NZB: రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ అజారుద్దీన్ను బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సంక్షేమం కోసం కృషి చేయాలని, రాష్ట్రాభివృద్ధిలో మైనార్టీలను భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు.