KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర మంత్రులతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి DRDO, PACS, DCMS, IKP ఆధ్వర్యంలో 233 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.