NLG: ధాన్యం సేకరణ నియమాలు ఉల్లంఘించినందుకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆలగడప క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి కుమారి, అవంతిపురం కొనుగోలు కేంద్ర ఇంఛార్జ్ కె. సైదులు సస్పెండ్ అయ్యారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేయగా, విచారణ అనంతరం సహకార అధికారి పత్యానాయక్ నివేదిక సమర్పించారు.