ATP: నందమూరి తారక రామారావు ప్రతి కళాకారుడికి, రాజకీయ నాయకుడికి ఆదర్శప్రాయుడని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురంలోని లయన్స్ క్లబ్లో శ్రీ నటరాజ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ సేవకుగాను ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.