నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు, భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడే రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదల నుంచి రక్షణ పొందేందుకు ఈ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో RDO రత్నకళ్యాణి, ZP CEO గోవింద్, మండల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.