NZB: జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాత్రి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత, నవిత నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. నిబంధన ఉల్లఘించిన రెస్టారెంట్లు, పరిశుభ్రత పాటించని హోటళ్లను గుర్తించారు. అలాగే ఆహార పదార్థాలలో నిషేదిత ఉప్పు, సింథటిక్, రంగులు ఉపయోగించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.