CTR: జిల్లాలో నాలుగు నూతన పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభోత్సవం చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగరి మండలాల పరిధిలో 116 ఎకరాలలో రూ.56.76 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.