CTR: ఢిల్లీ బాంబు ఘటన నేపథ్యంలో తిరుపతిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులు మొత్తం 5 టీంలుగా ఏర్పడి తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, RTC బస్టాండ్, రైల్వే స్టేషన్, గోవింద రాజ స్వామి ఆలయాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. SP సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయన్నారు.