CTR: పులిచర్ల మండలంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మండలంలోని కొత్తపేటలో ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో విమలమ్మ మృతి చెందగా కళావతమ్మ తీవ్ర గాయాలు పాలయింది. ఇంట్లో చోరీకి వచ్చిన దొంగను అడ్డుకునే ప్రయత్నంలో ఈ హత్య జరిగిందని స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.