VZM: ఢిల్లీలో నిన్న జరిగిన బాంబ్ పేలుళ్ల నేపథ్యంలో రామభద్రపురం పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి RTC కాంప్లెక్స్ వద్ద విసృత తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రయాణికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.