VZM: గత వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వారికి అప్పగిస్తుందని గజపతినగరం మాజీ MLA బొత్స అప్పల నరసయ్య ఆరోపించారు. సోమవారం గంట్యాడలోని గొడియాడలో వైద్య కళాశాలల పైవేటీకరణకు నిరసనగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు.