SKLM: నరసన్నపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఇవాళ ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎంపీడీవో కోటేశ్వరరావు ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఆరంగి మురళీధర్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.