వరంగల్ జిల్లా కేంద్రంలోని 17వ డివిజన్ బొల్లికుంటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కార్పొరేటర్ బాబు స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. పండించిన పంటకు మద్దతు ధర పొందేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులను నమ్మవద్దని హితవు పలికారు.