ELR: పోలవరం నియోజకవర్గంలో తన పేరు కానీ ఉపయోగించి ఎవరైనా దందాలకి పాల్పడితే సహించేది లేదని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెచ్చరించారు. సోమవారం జీలిగుమిల్లీ(M) బర్రింకలపాడులో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, ఇతర విషయాలలో కొంతమంది తన పేరును ఉపయోగించి దందాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.