TG: హైకోర్టులో మాజీ మంత్రి KTRకు ఊరట లభించింది. ఆయనపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ కించపరిచారని.. 2024 ఆగస్టు 20న కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశారు. అయితే రాజకీయ కక్షతో తనపై కేసు నమోదు చేశారని కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తాజాగా ఈ కేసును కోర్టు కొట్టివేసింది.