W.G: స్వంత స్థలంలో ఉన్న నిర్మాణాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆకివీడు మండలం దుంపగడప గ్రామానికి చెందిన పిన్నమరాజు సూర్యనారాయణ రాజు పీజీఆర్ఎస్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి వెళ్లే దారిలో సర్వేనెంబర్ 172/1డీలో తన స్థలంలో సరిహద్దులు వేసిన పిల్లర్లను కొంతమంది కావాలని నిర్మాణ సామాగ్రిని ధ్వంసం చేయించారని తెలిపారు.