CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందిని కలెక్టర్ కలిశారు. ఈ మేరకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా చూడాలని ఆయన సూచించారు. అనంతరం అవినీతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.