హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 158 మంది బాధితులు వివిధ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. కలెక్టర్ స్నేహ శబరిష్ దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.