‘కోల్డ్రిఫ్’ దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలోని ఔషధ తయారీదారులకు తాజాగా అల్టిమేటం జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి కంపెనీలు అంతర్జాతీయ తయారీ ప్రమాణాలను(GMP) తప్పనిసరిగా పాటించాలని.. లేనిపక్షంలో కంపెనీలు మూసుకోవాల్సిందేనని కేంద్రం హెచ్చరించింది.