MBNR: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ఇంజినీరింగ్ కళాశాలలో ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ. రమేష్ బాబు ఇవాళ స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతలో విద్యార్థులు నైపుణ్యం సాధించి, పరిశోధనాత్మక దిశగా ముందుకు సాగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా. చంద్రకిరణ్, తదితరులు పాల్గొన్నారు.