కృష్ణా: మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పంట నష్టాలను అంచనా వేయడానికి సోమవారం కేంద్ర అంతర మంత్రిత్వ శాఖ అధికారుల బృందం పునాదిపాడు గ్రామాన్ని సందర్శించింది. కంకిపాడు – ఉప్పులూరు ప్రధాన రహదారి పక్కన సాగులో ఉన్న వరి పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. కౌలు రైతులు భరత్, శ్రీనివాసరావు సాగు చేసిన ఎంటీయూ 1318 వరి పంటను అధికారులు పరిశీలించారు.