BDK: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లిక్కి బాలరాజు అన్నారు. సోమవారం కొత్తగూడెం లైబ్రరీ ఎదుట చేపట్టిన నిరుద్యోగ దీక్షలో మాట్లాడారు. నెలకు రూ.4000 నిరుద్యోగ భృతి, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, కొత్త నియామకాలపై ప్రణాళికలు చేపట్టలేదని విమర్శించారు.