TG: శంషాబాద్ విమానాశ్రయం మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దాలనేది తన ఆకాంక్ష అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి.. 2.70 లక్షల మంది ప్రయాణికుల అవసరాలకు తగినట్లు ఈ స్టేషన్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లోపు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.