SRCL: చిన్న నీటి పారుదల వనరుల సర్వే పకడ్బందీగా చేయాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. చిన్న నీటి పారుదల వనరుల సర్వే పై డీఆర్డీవో, వ్యవసాయ, ఈఈ పీఆర్, నీటి పారుదల శాఖ, సెస్, సీపీవో, తదితర శాఖల డిస్ట్రిక్ట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు.