ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా జట్టుకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. ‘ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా కొంతమంది ప్లేయర్లకు రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బహుమతులు ఇస్తున్నాయి. అయితే, ఈ బహుమతులు దక్కని క్రీడాకారిణులు నిరుత్సాహపడాల్సిన పని లేదు’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మహిళా క్రికెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.