ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 11 నుంచి సోయా కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపివేసినట్లు సెంటర్ ఇన్ఛార్జ్ పండరి ఇవాళ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. పలు సాంకేతిక సమస్యలతో నిలిపివేశామని, తర్వాత కొనుగోలు తేదీని ఒకరోజు ముందుగానే తెలియజేస్తామని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.