ప్రకాశం: పీసీపల్లి మండలం గుంటూరు లింగన్న పల్లి గ్రామంలో ఈ మంగళవారం ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా సీఎం ఉదయం 10.15 గంటలకు హెలిప్యాడ్ చేరి, 10.35 నుంచి 12.15 వరకు కార్యక్రమంలో పాల్గొని పార్క్ సౌకర్యాలు, కొత్త ప్రాజెక్టులను పరిశీలిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరతారు.