MBNR: BC, SC, ST వర్గాలు రాజ్యాంగ బద్ధమైన హక్కుల సాధన, రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని పాలమూరు యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. నాగం కుమారస్వామి పిలుపునిచ్చారు. నల్గొండలో నిర్వహించిన ధర్మయుద్ధ సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.