మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఈ ఎయిర్పోర్టును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు సంయుక్తంగా ప్రారంభించారు. ఏడాదికి 1.3M మంది ప్రయాణించేలా భారత్ సహకారంతో ఈ విమానాశ్రయాన్ని అప్గ్రేడ్ చేశారు. అందుకు అనుగుణంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేశారు.