BHNG: ఈ నెల 11, 13న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన అధికారులచే మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను, మూత్రశాలలను పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షించిన అంశాలను చెక్ లిస్ట్ రూపంలో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.