ఓ కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్లినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ శిక్షను అనుభవించారు. మధ్యప్రదేశ్ పచ్మర్హిలో జరిగిన INC శిక్షణా సమావేశానికి రాహుల్ 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు. దీంతో లేటుగా వెళ్లినందుకు శిక్షను ఎదుర్కోవాలని కార్యక్రమ చీఫ్ సచిన్ రావు సరదాగా సూచించారు. ఈ మేరకు రాహుల్ 10 పుష్-అప్స్ తీశారు. ఈ ఘటనతో అక్కడున్న కార్యకర్తలు చప్పట్లతో అభినందించారు.