మన్యం: జిల్లాను ఏనుగుల గుంపు వదలడం లేదు. పాలకొండ నియోజకవర్గం నుంచి పార్వతీపురం వరకు సంచరిస్తూ మన్యం వాసుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతిరోజూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారే తప్ప వాటి తరలింపునకు చర్యలు చేపట్టడం లేదని.. కుంకీ ఏనుగులు తెచ్చి సమస్యను పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు.