ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగింది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఢిల్లీ మీదుగా రాంచీకి ప్రయాణిస్తుండగా అక్కడి వాయుకాలుష్యం చూసి ఆందోళన చెందినట్లు వెల్లడించాడు. గోవాలోని ఓ కుగ్రామంలో తాను ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టాడు.