బీహార్ అసెంబ్లీ మలి విడత పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అన్ని బూత్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. మరో వైపు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విడతలో మొత్తం 122 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడతలో 65 శాతం పోలింగ్ జరిగింది.