సత్యసాయి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం ప్రారంభమైంది. దాదాపు 70 అజెండా అంశాలపై చర్చించనున్న ఈ సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఇదే సమయంలో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి లోకేష్ పలువురు మంత్రులతో సమావేశమై యువతకు 20 లక్షల ఉద్యోగాల హామీ త్వరగా నెరవేర్చాలని, విశాఖ CII సదస్సు విజయవంతం చేయాలని సూచించారు.