VZM: కొత్తవలసలో గల మాజీ MLA కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర YCP సంయుక్త కార్యదర్శి గొరపల్లి శివ ఆధ్వర్యంలో సోమవారం YCP ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 12న ఎస్. కోట మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.