W.G: పంచారామక్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామిని కార్తీక సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పంచారామాల దర్శనంలో భాగంగా స్వామివారిని దర్శించుకున్నట్లు పట్నాయక్ తెలిపారు. ప్రజలందరిపై దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. పూజల అనంతరం ఆలయ అధికారులు ఆయనను శేషవస్త్రంతో సత్కరించారు.