PPM: కురుపాం మండలంలోని నీలకంఠాపురం నుంచి జరడ గ్రామానికి వెళ్లే రహదారిలో మొత్తం రాళ్లు తేలిపోయి అధ్వానంగా ఉండడంతో ఆ దారిలో రాకపోకలు సాగించే వారంతా తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఈ రోడ్డు మీదుగా నడవలేకపోతున్నామ ని, వాహనాలతో వెళ్తుంటే గతుకులకు ఒళ్లు హూనమైపోతోందని పాదచారులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.