KMM: ముదిగొండ మండలం వల్లభి-బాణాపురం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఏపీ రాష్ట్రం గండ్రాయికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.