TG: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రేపు హార్ట్ సర్జరీ చేయించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఎవరూ కంగారు పడొద్దని ఆయన సూచించారు. వాల్వ్ లీకేజీ కారణంగా చిన్న సర్జరీ చేయించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొంత కాలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. మూడు రోజుల్లో తిరిగి వస్తానని కార్యకర్తలు, అభిమానులకు తెలిపారు.