SKLM: కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా పాతపట్నం కేంద్రంలో వెలసియున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారిని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. కార్తీక మాసం ఆధ్యాత్మికతకు ప్రతీక అని పేర్కొన్నారు.